మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 09:29:19

ర్యాడ మ‌హేశ్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఆర్థిక సాయం

ర్యాడ మ‌హేశ్ కుటుంబానికి 50 ల‌క్ష‌ల ఆర్థిక సాయం

హైద‌రాబాద్ : కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్‌ ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందిన విష‌యం తెలిసిందే. జ‌వాన్ మ‌హేశ్ మ‌ర‌ణం ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.