శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 15:39:51

రేపు కరీంనగర్‌ పర్యటనకు సీఎం కేసీఆర్‌

రేపు కరీంనగర్‌ పర్యటనకు సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు.

ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప, స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి.  కరీంనగర్ లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనరగ్ లో పర్యటించాలని భావించారు. కానీ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. సిఎంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్ లో పర్యటిస్తారు. అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు.


logo