శనివారం 11 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 00:49:12

వనపర్తిలో 300 కోట్లతో భగీరథ ప్లాంట్‌

వనపర్తిలో 300 కోట్లతో భగీరథ ప్లాంట్‌

వనపర్తి, నమస్తే తెలంగాణ: వనపర్తి పట్టణంలో తాగునీటి సరఫరాకు మిషన్‌ భగీరథ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ రూ.300 కోట్లు మంజూరు చేశారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ రామన్‌పాడు ద్వారా వనపర్తికి తాగునీటి సరఫరా విషయాన్ని సీఎంతో మాట్లాడగ సమస్యను పరిష్కరించేందుకు మిషన్‌ భగీరథ ప్లాంట్‌ మంజూరు చేశారన్నారు. ఈ పనులు చేపట్టేందుకు వెంటనే టెండర్లు పిలువాలని మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద భూసేకరణ పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు.


logo