బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 14:29:34

పేదల సొంతింటిని కలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్

పేదల సొంతింటిని కలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్

జగిత్యాల : నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు నిండేలా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయించారు.

ఈ సందరర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను యావత్ దేశం తలతిప్పి చూస్తుందన్నారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo