బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 22:58:55

సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే చర్యలు...

సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే చర్యలు...

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకుండా, ప్రభుత్వం నుంచి కన్ఫామ్‌ చేసుకోకుండా కరోనా వైరస్‌ గురించి ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌ గురించి, ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చిందని ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తేల్చి చెప్పారు. ఈ దేశ పౌరులుగా ఒక విపత్తు వచ్చినప్పుడు పౌరులుగా మనకు బాధ్యత ఉంటుందని, ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేయద్దని తెలిపారు. సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌పై ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 


logo
>>>>>>