శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 14:55:34

అరాచకం ఎవరు చేస్తున్నారో కనబడుతుంది : సీఎం కేసీఆర్‌

అరాచకం ఎవరు చేస్తున్నారో కనబడుతుంది : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌  : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్గ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెబుతున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై సీఎం కేసీఆర్‌  ఫైర్‌ అయ్యారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరవడం సరికాదన్నారు. సభకు ఆటంకం కలిగించే చర్యలను సహించమని హెచ్చరించారు. సభలో ఎవరు అరాచకం ఎవరు చేస్తున్నారో స్పష్టంగా కనబడుతుందన్నారు. అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంటుంది.. దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. సభలో ఇష్టమొచ్చినట్లు అరిచి, అరాచకం సృష్టిస్తే కుదరదు అని సీఎం తేల్చిచెప్పారు. ఏదో ఒక విధంగా బయటకు వెళ్లాలనేది కాంగ్రెస్‌ సభ్యుల గొడవ.. అందుకే అరుస్తున్నారని సీఎం పేర్కొన్నారు. సభకు ఆటంకం కలిగించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సీఎం సూచించారు. దీంతో ఆరుగురు సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్‌ చేశారు.


logo