గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 15:11:12

ష‌బ్బీర్ అలీ దొంగ ముచ్చ‌ట్ల‌పై సీఎం కేసీఆర్ ధ్వ‌జం

ష‌బ్బీర్ అలీ దొంగ ముచ్చ‌ట్ల‌పై సీఎం కేసీఆర్ ధ్వ‌జం

జ‌న‌గామ : ‌కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ దొంగ ముచ్చ‌ట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కిరికిరిగాళ్ల ముచ్చ‌ట్లు ఎట్ల ఉంటాయో ష‌బ్బీర్ అలీ క‌థ చూస్తే అర్థ‌మైత‌ద‌ని కేసీఆర్ తెలిపారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.  

ష‌బ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నాయ‌కుడు.. మెద‌క్ జిల్లా నార్సింగి మండ‌లం జ‌ప్తిసిగునూరు గ్రామంలోని స‌ర్వే నంబర్ 408 నుంచి 413 వ‌ర‌కు ఆయ‌నకు భూములు ఉన్నాయి. ఈ భూముల్లో వ‌రి వేసుకుని పంట కోసిండు. ఆ త‌ర్వాత‌ వ‌ట్టి గ‌డ్డిని కాల‌పెట్టిండు. సీఎం స‌న్న ర‌కం పెట్ట‌మంటే పెట్టిన‌.. న‌ష్ట‌పోయాను అని ఆయ‌న ఫాంహౌజ్‌లో ప‌ని చేసే గ‌ణేశ్ అనే ఎల‌క్ర్టిషీయ‌న్‌తో చెప్పించిండు. డ్రామాలు చేసిండు. ఇది ష‌బ్బీర్ అలీ క‌థ‌. ఇంత దొంగ ముచ్చ‌ట్లా.. సోష‌ల్ మీడియా కాదు.. యాంటీ సోష‌ల్ మీడియా అయిపోయింది. ప్ర‌తిప‌క్షాల‌కు దొంగ మాట‌లు మాట్లాడ‌టం అల‌వాటైపోయింది. రైతుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌డం ఇదేనా? కేసీఆర్‌ను బ‌ద్నాం చేయ‌డ‌మే వారు ప‌నిగా పెట్టుకున్నారు. భ‌యంక‌ర‌మైన మోసాలు చేస్తున్నారు. గుండెల నిండా నిజాయితీ ఉన్న సీఎంను ఎవ‌రూ ఏం చేయ‌లేరు అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.