మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 12:53:50

దేశానికి పట్టిన భయంకరమైన కరోనా వైరస్‌.. కాంగ్రెస్సే

దేశానికి పట్టిన భయంకరమైన కరోనా వైరస్‌.. కాంగ్రెస్సే

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కరోనా వైరస్‌పై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ.. కరోనా వంటి సున్నిత అంశాలను రాజకీయం చేయొద్దు. ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దు అన్నారు. ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనా వైరస్‌.. కాంగ్రెస్సే అని సీఎం విమర్శించారు. దేశానికి పట్టిన ఆ దరిద్రం ఇప్పటికే వదిలింది అని కేసీఆర్‌ అన్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం ఏమీ చేయడం లేదనే మాటలు సరికాదన్నారు. కేంద్రం అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలంతా పాటించాలి. తమ బాధ్యతను వంద శాతం చిత్తశుద్ధితో నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. అన్ని విషయాలపై ఇప్పటికే చర్చించాం. సాయంత్రం 5:30 గంటల వరకు అన్ని డిపార్ట్‌మెంట్ల నివేదికలు వస్తాయి. సాయంత్రం 6 గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.


logo
>>>>>>