మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 16:13:13

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు : మంత్రి హరీశ్ రావు

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : సీఎం కేసీఆర్ రైతు శ్రేయోభిలాషి, రైతు కష్టం తెలిసిన మనిషిగా రైతుల కోసం ఆలోచన చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో గురువారం మండలంలోని 546 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 70 ఏండ్లలో జరగని పనిని ఆరేండ్లలో టీఆర్ఎస్  ప్రభుత్వ హాయాంలో పూర్తి చేసుకున్నామని తెలిపారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుబంధు పథకం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల గుండెల్లో రెండు బాంబులు వేసిందని పేర్కొన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేశారని, ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ పార్టీని ప్రశ్నించారు.  అలాగే బాయికాడ, బోర్లకాడ మీటర్లు పెట్టి కరెంట్ బిల్లులు వసూళ్లు చేయాలని రైతులకు అన్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పొరేటీకరణకు తెరలేపి నయా జమీందారు వ్యవస్థను తెస్తోందని పేర్కొన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం యేటా 45 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 56 వేల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. బీడీ కార్మికులకు పెన్షన్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అందజేస్తుందన్నారు.


logo