హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైందని పేర్కొన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామని, ఒక మనిషి ఎదుగుదలకు తల్లి పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది, స్వచ్ఛమైందని పేర్కొన్నారు.