e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides గంగాజమున తెహజీబ్‌కు రంజాన్‌ ప్రతీక

గంగాజమున తెహజీబ్‌కు రంజాన్‌ ప్రతీక

గంగాజమున తెహజీబ్‌కు రంజాన్‌ ప్రతీక
  • ముస్లింలకు సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మే 13 (నమస్తే తెలంగాణ): ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్‌ మాసం శాంతి, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో గంగాజమున తెహజీబ్‌ సంస్కృతికి రంజాన్‌ ప్రతీక అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రంజాన్‌ను త్యాగం, దానం, ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని గవర్నర్‌ అభివర్ణించారు. రంజాన్‌.. ప్రమాదకర వైరస్‌లను నిర్మూలించి మానవ సమాజంలో కొత్త వెలుగును తీసుకురావాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతీ రాథోడ్‌, గంగుల కమలాకర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గంగాజమున తెహజీబ్‌కు రంజాన్‌ ప్రతీక

ట్రెండింగ్‌

Advertisement