సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 16:08:39

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 

క్రిస్టియన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నది. నగర శివార్లలోని కోకాపేటలో  రెండెకరాలలో అధునాతన క్రిస్టియన్‌ భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించింది. క్రిస్‌మస్‌ సందర్భంగా ఏటా 2.4 లక్షల మంది పేదలకు చీరలు, దుస్తులతోపాటు గిఫ్ట్‌ ప్యాక్‌లు అందిస్తున్నది. 400 చర్చిల నిర్మాణం, రిపేర్లకు రూ.32 కోట్లు మంజూరు చేసింది. చర్చిల ఆధ్వర్యంలో నడుస్తున్న దవాఖానలకు రూ.10 లక్షలు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నది.


logo