బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 17:52:24

కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ : ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిర వాసులు దుర్మరణం చెందడం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డవారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లాలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగ్గయ్యపేట మండలం వేలాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరో 16 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మంది ట్రాక్టర్‌లో వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం భారిన పడ్డారు.


logo