బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 11:11:52

రత్నాకర్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

రత్నాకర్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జువ్వాడి రత్నాకర్‌ రావు(92) అనారోగ్య కారణంతో ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రత్నాకర్‌ రావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రత్నాకర్‌ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అదేవిధంగా మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతిపట్ల స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మంత్రి ఈటల రాజేందర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. 


logo