సోమవారం 06 జూలై 2020
Telangana - Apr 09, 2020 , 13:00:35

కావేటీ సమ్మయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

కావేటీ సమ్మయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కావేటి సమ్మయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమ్మయ్య మృతిపట్ల పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలిపారు.


logo