బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:03

సంబురపడ్డ ఐదుదోనాల తండా

సంబురపడ్డ ఐదుదోనాల తండా

  • స్థానిక సమస్యలపై కలెక్టర్‌తో సీఎం కేసీఆర్‌ ఆరా
  • రోడ్డు మరమ్మతుకు నిధులు మంజూరు

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని ఐదుదోనాల తండా వాసులు సంబురాల్లో మునిగితేలారు. సీఎం కేసీఆర్‌ ఫోన్‌చేసి తండా సమస్యలపై ఆరాతీయడంతోపాటు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రోడ్డుకు మోక్షం కల్పించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ప్రచురితమైన ‘కేసీఆర్‌ నీళ్లొచ్చినయ్‌' కథనానికి సీఎం కేసీఆర్‌ స్పందించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. తండాలో సౌకర్యాలపై ఆరాతీశారు. తండాకు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేదనే విషయం తెలుసుకుని.. రోడ్డు మరమ్మతుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమెను ఆదేశించారు. వెంటనే కలెక్టర్‌  అధికారులతో కలిసి తండాను సందర్శించి కంకర తేలిన రోడ్డును పరిశీలించి మట్టి రోడ్డు నిర్మాణానికి రూ.4 లక్షలు మంజూరు చేశారు. రోడ్డు సమస్యపై ఏకంగా సీఎం కేసీఆర్‌ స్పందించడంపై ఐదుదోనాల తండా ప్రజలు సంబురపడ్డారు. ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.logo