మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 11:19:48

వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ర్టేష‌న్‌పై రేపు సీఎం స‌మీక్ష‌

వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ర్టేష‌న్‌పై రేపు సీఎం స‌మీక్ష‌

హైద‌రాబాద్ : వ‌్య‌వ‌సాయేత‌ర భూమ‌ల రిజిస్ర్టేష‌న్‌పై రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ రేపు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించనున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి? వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ఏం చేయాలి? అనే విషయాలు చర్చించడానికి సీఎం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.