సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 18:18:08

కోతులకు అరటిపండ్లు పంచిన సీఎం కేసీఆర్‌

కోతులకు అరటిపండ్లు పంచిన సీఎం కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతను చాటారు. యాదాద్రి తిరుగు ప్రయాణంలో దారి పక్కన కోతులకు సీఎం అరటిపండ్లు పంపిణీ చేశారు. యాదాద్రి ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద కోతుల గుంపును చూసిన సీఎం కేసీఆర్‌ వాహనం దిగి కోతులకు స్వయంగా అరటిపండ్లు అందజేశారు. 

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ ప్రగతి పనులను పరిశీలించేందుకు సీఎం నేడు యాదాద్రికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో కలియతిరుగుతూ పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. logo