శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 11:00:10

అసెంబ్లీ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

అసెంబ్లీ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

హైద‌రాబాద్‌: అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై సీఎం కేసీఆర్ నేడు మంత్రులు, ఇత‌ర‌ నేత‌ల‌తో సమీక్ష నిర్వ‌హించానున్నారు. మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌ల‌తో ఈరోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశం కానున్నారు. ఈ నెల 7 నుంచి శాస‌న మండ‌లి, శాస‌నస‌భ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేప‌థ్యంలో స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, అనుస‌రించాల్సిన వ్యూహం, ఇత‌ర అంశాల‌పై సీఎం చ‌ర్చించనున్నారు. అదేవిధంగా క‌రోనా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా స‌మావేశాలను ఎలా నిర్వ‌హించాల‌నే అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది.  


logo