శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 12:08:33

భూస్వాములు, జాగీర్దార్లు లేరు : సీఎం కేసీఆర్

భూస్వాములు, జాగీర్దార్లు లేరు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో భూస్వాములు, జాగీర్దార్లు, జ‌మీందార్లు లేర‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో నూత‌న రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. కొంత‌మంది నాయ‌కులు బ‌య‌ట అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఈ బిల్లు వ‌ల్ల భూస్వాముల‌కు లాభం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. కానీ తెలంగాణ‌లో భూస్వాములు, జాగీర్దార్లు, జ‌మీందార్లు లేర‌ని సీఎం తేల్చిచెప్పారు. ఇది కఠోర స‌త్య‌మ‌ని అని సీఎం అన్నారు. 

రాష్ర్టంలో మొత్తం 60,95,134 మంది ప‌ట్టాదారులు ఉన్నార‌ని చెప్పారు. 2.5 ఎక‌రాల భూమి ఉన్న రైతులు 39,52,232 మంది ఉన్నార‌ని తెలిపారు. 2.5 నుంచి 3 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 4,70,759 మంది, 3 నుంచి 5 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 11,08,193 మంది, 5 నుంచి 7.5 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 3,49,382 మంది, 7.5 నుంచి 10 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 1,15,916 మంది, 25 వేల ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు. 


logo