శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 08, 2020 , 01:00:28

సీఎం నిర్ణయం అభినందనీయం

సీఎం నిర్ణయం అభినందనీయం

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ నివారణలో భాగంగా విశేష సేవలందిస్తున్న మున్సిపల్‌ కార్మికులు, డాక్టర్ల, వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రోత్సాహకాలు ప్రకటించడం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ  వెంకటరెడ్డి అన్నారు. కొవిడ్‌-19 ను అరికట్టడానికి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలు సముచితంగా ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా వలస కార్మికులు, నిరుపేదలు, చేతివృత్తులవారికి బియ్యం సరఫరా 60 శాతం పూర్తయినట్టు జిల్లాల నుంచి తమకు సమాచారం అందిదన్నారు. కుటుంబాలకిచ్చే రూ.1,500 ఆర్థికసాయాన్ని పేదల ఖాతాల్లో నేరుగా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగించే అవకాశం ఉన్నందున ఇలాంటి సమస్యలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.


logo