బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:57:27

నెల్లూరులో ఆలయానికి సీఎం కేసీఆర్‌ దంపతుల విరాళం

నెల్లూరులో ఆలయానికి సీఎం కేసీఆర్‌ దంపతుల విరాళం

  • మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి చేయూత
  • స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో శిలాఫలకం ఆవిష్కరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ దంపతులు చేయూతనందించారు. ఆలయం ముందుభాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళం అందజేశారు. శనివారం ఆలయంలో శ్రీవారి విగ్రహప్రతిష్ఠ, కుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొనాల్సి ఉండగా, కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా కుదరలేదు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న మొక్కుల మేరకు గతంలోనూ కేసీఆర్‌ తిరుమల శ్రీవారికి, విజయవాడ దుర్గమ్మకు బంగారు ఆభరణాలు సమర్పించిన విషయం తెలిసిందే.


logo