శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 11:41:12

ఉపరాష్ట్రపతికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

ఉపరాష్ట్రపతికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉపరాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్‌ ద్వారా సీఎం శుభాకాంక్షలు అందజేశారు. అదేవిధంగా ఓ పూల బొకేను పంపించారు. వెంకయ్యనాయుడు ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడపాలని సీఎం ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో, సంవత్సరాల్లో దేశానికి సేవలు మరింతగా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. 


logo