సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 07:48:15

నోముల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

నోముల మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్‌: ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నోముల నిలిచిపోతారని చెప్పారు. నోముల మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటన్నారు. 

నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటనే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ నోముల మృతి చెందారు.