మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 13:20:04

నంది ఎల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

నంది ఎల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నంది ఎల్లయ్య మృతిపట్ల రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు పలువురు సంతాపం తెలిపారు. కరోనాతో బాధపడుతున్న ఎల్లయ్య నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 


logo