బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 16:28:01

రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు : సీఎం కేసీఆర్

రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు మాత్ర‌మే అని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ చ‌ట్టంపై స‌భ్యులంద‌రూ ఉత్త‌మ‌మైన స‌ల‌హాలు ఇచ్చారు. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో ఇది తొలి అడుగు అని తేల్చిచెప్పారు. స‌మైక్య రాష్ర్టంలో 160 నుంచి 170 వ‌ర‌కు చ‌ట్టాలు ఉండేవ‌ని సీఎం గుర్తు చేశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 87 చ‌ట్టాలు ఉన్నాయ‌ని తెలిపారు. ధ‌ర‌ణి మాత్ర‌మే కాదు మిగ‌తా చ‌ట్టాలు ఉంటాయ‌న్నారు. ఆర్‌వోఆర్‌, ధ‌ర‌ణి స‌ర్వ‌స్వం కాదు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించే అంశాల‌ను మాత్ర‌మే తొల‌గిస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. నూత‌న రెవెన్యూ చ‌ట్టం అంతం కాదు.. ఇది ఆరంభం మాత్ర‌మే అని తెలిపారు. చ‌ట్టంలో అన్నీ తీసేయ‌డం లేదు. ప‌లు చ‌ట్టాల స‌మాహారంగా రెవెన్యూ చ‌ట్టం కొనసాగుతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 57 ల‌క్ష‌ల 90 వేల‌మంది రైతుల‌కు రైతుబంధు అందించామ‌న్నారు. కేవ‌లం 28 గంట‌ల్లో రూ. 7,200 కోట్లు రైతుల‌కు అందించ‌గ‌లిగామ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల్గించే అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించామ‌న్నారు. గ్రామాల్లో ఎవ‌రి జీవితం వారే సాగిస్తున్నారు. గ్రామాల్లో వివాదం ఉన్నవి చాలా త‌క్కువ అని సీఎం కేసీఆర్ అన్నారు. 

ఇవి కూడా చదవండి..

స‌మ‌గ్ర స‌ర్వేతోనే భూ వివాదాల‌కు ప‌రిష్కారం : సీఎం కేసీఆర్

అట‌వీ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేక కాల‌మ్ : సీఎం

దేవాదాయ, వక్ఫ్‌ భూములను రక్షిస్తాం : సీఎం కేసీఆర్‌

సాదా బైనామాల‌కు మ‌రోసారి అవ‌కాశం! : సీఎం కేసీఆర్

కౌలుదారి వ్య‌వ‌స్థ‌ను ప‌ట్టించుకోం : సీఎం కేసీఆర్


logo