శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 14:49:02

విద్యుత్ బిల్లులు త‌గ్గేలా చ‌ర్య‌లు : సీఎం కేసీఆర్

విద్యుత్ బిల్లులు త‌గ్గేలా చ‌ర్య‌లు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించిన కార‌ణంగా విద్యుత్ బిల్లులు రికార్డు చేయ‌లేదు. ఆ స‌మ‌యంలో అధికంగా వ‌చ్చిన విద్యుత్ బిల్లులు త‌గ్గేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. కొవిడ్ సంద‌ర్భంలో విద్యుత్ బిల్లులు రికార్డు చేయ‌లేదు కాబ‌ట్టి మూడు నెల‌లు క‌లిపి వేయ‌డం ద్వారా ఎక్కువ బిల్లు వ‌చ్చింద‌ని స‌భ్యులు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు భార‌మైతుంద‌ని చెప్పారు. అది వాస్తవం కావొచ్చు.. కాక‌పోవ‌చ్చు. నాకు తెల్వ‌దు. కానీ మీరు దృష్టికి తెచ్చినందుకు వంద శాతం ఇప్పుడే ఆర్డ‌ర్లు ఇస్తాం. ఆ మూడు నెల‌లు డివైడ్ చేసి ఏదైనా భారం ప‌డితే తొల‌గిస్తామ‌ని హామీ ఇస్తున్నాం. అటువంటి భారం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌నివ్వ‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. 


logo