ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 15:08:10

ఎవుసంలో నవశకం..అదే సీఎం కేసీఆర్ అభిమతం

ఎవుసంలో నవశకం..అదే సీఎం కేసీఆర్ అభిమతం

కరీంనగర్ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మహానేత సీఎం కేసీఆర్ అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాలోని కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్, రైతుబంధు, కాళేశ్వరం జలాలతో నీరందిస్తుండటంతో పంటలు విరివిగా పండాయన్నారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ఐదు వేల మంది రైతులకు ఓ క్లస్టర్ గా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు లాభదాయకమైన పంటలు ఏవి వేయాలో చర్చించుకునేందుకు రైతు వేదికలు ఉపయోగపడుతాయన్నారు. గతంలో లేని విధంగా జూన్ నెలలో రైతులు నార్లు పోస్తున్నారు. ఇప్పటి నుంచి రైతులు వర్షాల కోసం ఎదురు చూడకుండా చెరువుల్లో ఉన్న కాళేశ్వరం జలాలను చూసి నిరభ్యంతరంగా పంటలు వేసుకోవచ్చని సూచించారు. రైతు శ్రేయస్సు కోసం పని చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మండి.. ప్రతి పక్షాల మాటలు విని మోసపోవొద్దన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతుల సంతోషంగా ఉండటమే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. 


logo