మంగళవారం 26 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:21

వలస కూలీకి భరోసాలో కేసీఆరే బెస్ట్‌

వలస కూలీకి భరోసాలో కేసీఆరే బెస్ట్‌

  • వైరల్‌ అవుతున్న సంజయబారు వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొరుగు రాష్ర్టాల వలస కూలీలకు భరోసా కల్పించిన తీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంనుంచి ఏ ఒక్క వలస కూలీ ఆకలితో అలమటించకూడదని ప్రకటన చేసి.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లుచేసిన కేసీఆరే బెస్ట్‌ అని ప్రశంసలు కురుస్తున్నాయి. దేశంలో వలస కూలీలను ఆదుకొనేందుకు స్వయంగా ముందుకొచ్చింది తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని ప్రశంసిస్తూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ మీడియా సలహాదారు (ప్రముఖ జర్నలిస్టు) సంజయబారు చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో మరోసారి వైరల్‌ అవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల కూలీలు ఇక్కడే ఉండాలని, వదిలి వెళ్లవద్దని సీఎం కేసీఆర్‌ వలస కూలీలకు విజ్ఞప్తిచేశారని, వారికి అర్థమయ్యేలా హిందీలో మాట్లాడి భరోసా కల్పించడం చాలా గొప్ప విషయమని పేర్కొంటూ సంజయబారు ఒక వీడియోను విడుదలచేశారు. అది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది.logo