శనివారం 04 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 08:51:11

అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి గన్‌పార్క్‌ చేరుకున్న సీఎం అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. 

హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. మరికాసేపట్లో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. 

తెలంగాణ భవన్‌లోలో నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు జాతీయ జెండా ఎగురవేశారు.


logo