గురువారం 28 మే 2020
Telangana - May 04, 2020 , 00:52:32

కష్టజీవులకు అండగా సీఎం కేసీఆర్‌

కష్టజీవులకు అండగా సీఎం కేసీఆర్‌

  • పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి 
  • మరో ఏడాదిదాకా వైరస్‌ ప్రభావం
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌

దామెర (వరంగల్‌ రూరల్‌): రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తూ కష్టజీవులకు అండగా ఉంటున్నారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెరలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు నిత్యావసర సరుకులను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి అందజేశారు. ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌-19 వ్యాప్తి నివారణకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను దేశ, విదేశాలతోపాటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు అభినందిస్తున్నాయని చెప్పారు. బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ మరో ఏడాది వరకు కరోనా  ప్రభావం ఉంటుందన్నారు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ప్రజలు బయటికిరావద్దని సూచించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, మంద అయిలయ్య పాల్గొన్నారు.


logo