మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:39:12

సింగరేణి అధికారులకు 111 కోట్లు

 సింగరేణి అధికారులకు 111 కోట్లు

  • పీఆర్పీ చెల్లింపునకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం

గోదావరిఖని, జనవరి 6: సింగరేణి అధికారులకు కొత్త ఏడాదిలో సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న 2500 మంది అధికారులకు పర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే (పీఆర్పీ) చెల్లించాలని నిర్ణయించారు. 2018-19కి సంబంధించి బకాయిగా ఉన్న రూ.111 కోట్లను చెల్లించేందుకు అంగీకరించారు. ఈ మొత్తాన్ని ఫిబ్రవరి నెలలో చెల్లించనున్నారు. దీనివల్ల జూనియర్‌ అధికారులకు రూ.లక్ష వరకు పీఆర్పీ వస్తుంది. సీనియర్‌ అధికారులకు రూ.5 లక్షల వరకు రానున్నది. పీఆర్పీ చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై సింగరేణి సీఎండీ శ్రీధర్‌ హర్షం వ్యక్తంచేశారు. కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సింగరేణి బ్రాంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జక్కం రమేశ్‌, ఎన్వీ రాజశేఖర్‌రావు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


logo