మంగళవారం 26 మే 2020
Telangana - May 20, 2020 , 22:39:54

మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మిర్యాలగూడ : మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని శానసమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలు, క్రైస్తవులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రమని, సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శవంత పాలన సాగిస్తున్నారని కొనియాడారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్నారు. 

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో పకడ్బందీ చర్యలు చేపట్టారని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, ఏఎంసీ చైర్మన్‌ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  logo