శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 17:35:15

'ఆడ‌పిల్ల‌ల పెండ్లిళ్ల‌కు తోబుట్టువులా సీఎం కేసీఆర్‌'

'ఆడ‌పిల్ల‌ల పెండ్లిళ్ల‌కు తోబుట్టువులా సీఎం కేసీఆర్‌'

సిద్దిపేట : తల్లి బరువును దించేలా.. తోబుట్టువులా సీఏం కేసీఆర్ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి  గురువారం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. రూ.4.79 కోట్ల విలువైన‌ వివిధ అభివృద్ధి పనులకు ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. అదే విధంగా సమీకృత ఆఫీసు కాంప్లెక్సులో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

సిద్ధిపేట జిల్లాలో 5,588 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద రూ.48 కోట్ల 45 లక్షల సాయం అందించినట్లు వెల్లడించారు. పేదింటి ఆడ పిల్లల పాలిట కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఓ వరమన్నారు. ఇవాళ రూ.4.79 కోట్లతో గజ్వేల్‌లో వివిధ అభివృద్ధి పనుల కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రూ.30 లక్షలతో షీ టాయిలెట్స్, రూ.81.25 లక్షలతో భూసార పరీక్షా కేంద్రం, ఎడ్యుకేషన్ హబ్ లో రూసా నిధులు రూ.80 లక్షలతో సోలార్ సిస్టమ్, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు.