శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 02:07:04

అవసరమైతే నేనే వెళ్తా!

అవసరమైతే నేనే వెళ్తా!

  • కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల్ని కలిసేందుకు బెంగళూరుకు వెళ్తానన్న సీఎం కమల్‌నాథ్‌  

భోపాల్‌/బెంగళూరు: బెంగళూరులోని ఓ రిసార్టులో మకాంవేసిన తమ 16 మంది రెబల్‌ ఎమ్మెల్యేల్ని కలుసుకునేందుకు అవసరమైతే తానే వెళ్తానని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. భోపాల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఓ ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. తాను బెంగళూరుకు వెళ్లాలనుకుంటున్న విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కర్ణాటక సీఎం యెడియురప్పకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించేందుకు కమల్‌నాథ్‌ ప్రయత్నించారని, అయితే వాళ్లు అందుబాటులోకి రాలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు.. తమ ఎమ్మెల్యేల్ని కలుసుకునేందుకు బుధవారం ఉదయం బెంగళూరులో వాళ్లున్న రిసార్టుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తమను ఎవ్వరూ బలవంతంగా నిర్బంధించలేదని, స్వచ్చందంగానే ఇక్కడికి వచ్చామని కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు తెలిపారు. రెబల్‌ ఎమ్మెల్యేలను జడ్జి చాంబర్‌లో ప్రవేశపెట్టేలా ఆదేశాలివ్వాలంటూ బీజేపీ నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. 


logo