శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 13, 2020 , 01:37:24

గ్రామాలను నిలబెట్టాలనేది సీఎం స్వప్నం

గ్రామాలను నిలబెట్టాలనేది సీఎం స్వప్నం

  • ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వయంగా రైతయిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ రంగంపై ఉన్న మమకారాన్ని మాటల్లో వర్ణించలేమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వ్యవసాయ రంగం, దాని అనుబంధ వృత్తుల పునాదుల మీద ఎలాగైనా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణంపోసి గ్రామాలను నిలబెట్టాలనేది ఆయన స్వప్నమని మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా, దేశానికే దిక్సూచిలా మారే సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తున్నదంటూ ఓ పత్రికలో ప్రచురితమైన క్లిప్పింగ్‌ను జతచేశారు.logo