మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 16:12:05

భట్టి విక్రమార్కకి డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను చూపించిన మంత్రి తలసాని

భట్టి విక్రమార్కకి డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను చూపించిన మంత్రి తలసాని

హైదరాబాద్ నగరంలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు చూపించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. మంత్రి స్వయంగా తన కారులో తీసుకుపోయి విక్రమార్కను తీసుకువెళ్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను చూపించారు. వీరితో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కూడా వెళ్లారు. 


ల‌క్ష ఇండ్ల నిర్మాణాల కోసం ప్ర‌భుత్వం రూ. 10 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతుంద‌ని మంత్రి తెలిపారు. కొల్లూరులో 15 వేల ఇండ్లు నిర్మించాం. అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ ఇండ్ల‌ను పూర్తి చేసి పేద‌వారికి పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం ముందుకెళ్తుంది. ల‌బ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. బ‌స్తీల స‌మ‌క్షంలోనే ఇండ్ల‌ను పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇండ్ల పంపిణీలో ఎలాంటి రాజ‌కీయ ప్ర‌మేయం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. డిమాండ్ ఉన్న చోట భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఇండ్ల‌ను నిర్మిస్తామ‌న్నారు. 
logo