శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 09:44:22

నాగార్జునసాగర్‌ గేట్ల మూసివేత

నాగార్జునసాగర్‌ గేట్ల మూసివేత

హైదరాబాద్‌ : ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండడంతో ఆదివారం నాగార్జున సాగర్‌ డ్యామ్‌ క్రస్ట్‌ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం 46,227 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అలాగే అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. 589.80 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.