మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 16:20:12

నిమ్స్‌లో కరోనా వాక్సిన్ క్లినికల్ పరీక్షలు

నిమ్స్‌లో కరోనా వాక్సిన్ క్లినికల్ పరీక్షలు

హైదరాబాద్ : నిమ్స్‌ దవాఖానలో కరోనా వాక్సిన్ క్లినికల్ పరీక్షలు స్పీడ్ అందుకున్నాయి. ఫస్ట్ ఫేజ్‌కు ఏర్పట్లు సిద్ధం చేశారు.  ఇవ్వాళ ఇద్దరికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరుగురు వాలంటీర్ల రక్త నమూనాలు సేకరించి ఐసీఎంఆర్‌కు నిమ్స్ వైద్యులు పంపించారు. వారిపై వ్యాక్సిన్ పరీక్షలకు ఐసీఎంఆర్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. వాక్సిన్ ఇచ్చాక 2 రోజుల పాటు ప్రత్యేక వార్డుల్లో వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు.

యాంటీ బాడీస్ డెవలప్‌మెంట్ అయ్యే తీరును వైద్యులు పరిశీలించనున్నారు. ఇబ్బందులు లేకపోతే 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయనున్నారు. అన్నీ బాగుంటే కోవాగ్జిన్ రెండో డోస్‌‌ను 14 రోజుల తర్వాత మళ్లీ వలంటీర్లకు నిమ్స్ దవాఖానలో వైద్యులు ఇవ్వనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo