సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 02:43:25

క్లినికల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌పై పిల్‌

క్లినికల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌పై పిల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (రిజిస్టరింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2010 అమలుకు క్లినికల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ను, ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటుచేయాలని, నిబంధనల అమలుకు ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఫోరం అగైనెస్ట్‌ కరప్షన్‌ అధ్యక్షుడు విజయ్‌గోపాల్‌ ఈ పిటిషన్‌ దాఖలుచేశారు. 2010లో పార్లమెం టు ఆమోదం పొందిన ఈ చట్టాన్ని 2012లో కేంద్రం నోటిఫై చేసిందని, 2017లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లలో కనీస ప్రమాణాలు, నాణ్యతను పాటించేలా పర్యవేక్షణ జరిపేందుకు స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, జిల్లాస్థాయిలో డిస్ట్రిక్ట్‌ రిజిస్టరింగ్‌ అథారిటీలను ఏర్పాటుచేసేలా ఆదేశాలు జారీచేయాలని హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. కనీస ప్రమాణాలు, నాణ్యత పాటించని సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం ఈ సంస్థలకు ఉంటుందని పేర్కొన్నారు.  


logo