ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 11:33:31

కరోనా నియంత్రణకు ఇంటిని ఇలా శుభ్రపరుచుకోండి..

కరోనా నియంత్రణకు ఇంటిని ఇలా శుభ్రపరుచుకోండి..

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యం. మనతోపాటు మనముండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ తాకే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవాలి. అప్పుడే వైరస్‌ మన దరిచేరదు. ఈ నేపథ్యంలో ఇంటిని ఎలా శుభ్రపరుచుకోవాలో చూద్దాం..

  • మనం ఎక్కువగా తాకే ప్రదేశాలను తరచూ సబ్బు, నీటితో శుభ్రంచేసుకోవాలి. టేబుళ్లు, స్విచ్‌లు, డోర్లు, కిచెన్‌, సింక్‌లు, హ్యాండిళ్లు,    డెస్క్‌లు, ఫోన్లు, కీబోర్డులు, టాయ్‌లెట్లు, కొళాయిలు తదితర వాటిని తరచూ శుభ్రపరచుకోవాలి.
  • బ్లీచ్‌, ఆల్కహాల్‌ ద్రావణాలను ఉపయోగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తగిన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి. కనీసం 70 శాతం ఆల్కహాల్‌ ఉన్న ద్రావణాలను ఉపయోగించవచ్చు.
  • కార్పెట్లు, రగ్గులు, తెరలను సబ్బు లేదా ఇతర క్రిమిసంహారక ద్రావణాలతో క్లీన్‌ చేసుకోవాలి. పూర్తిగా ఆరేటట్లు చూసుకోవాలి.
  • దుస్తులు, టవళ్లు, ఇతర వస్ర్తాలను ఉతికేటప్పుడు డిస్పోజబుల్‌ గ్లవ్స్‌ను తప్పక ధరించాలి. అపరిశుభ్రంగా ఉన్న వాటిని ముట్టుకోకూడదు. రోగుల దుస్తులను వేరుగా ఉతకాలి. వాషింగ్‌ కోసం వేడినీటిని ఉపయోగించాలి.
  • చేతులను తరచూ కనీసం 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. వ్యాధితో బాధపడుతున్నవారిని కలిసిన తర్వాత, గ్లవ్స్‌ తొలిగించిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకోవాలి. 
  • వైరస్‌ బాధితులు ప్రత్యేకంగా వేరే గదిలో ఉండాలి. అక్కడే భోజ నం, నిద్ర చేయాలి. పాత్రలు, ఇతర వస్తువుల ను వేడి నీటితో గ్లవ్స్‌ ధరించి శుభ్రం చేయాలి. బాధితులకు ప్రత్యేకంగా ఒక డస్ట్‌బిన్‌ను కేటాయించాలి. చెత్తను తొలిగించేటప్పుడు తప్పక గ్లవ్స్‌ ధరించాలి. తర్వాత చేతులు కడుక్కోవాలి. 


logo