మట్టి పాత్రలే ఆరోగ్యకరం

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
బడంగ్‌పేట, జనవరి 24: ప్లాస్టిక్ వాడకం వల్లే రోగాలు వస్తున్నాయని, మట్టి పాత్రలే మనిషికి ఆరోగ్య కరమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రకృతి నుంచి ఆరోగ్యం చేకూరుతుందని, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా మట్టి పాత్రల అవసరం పెరిగిందని వివరించారు. హైదరాబాద్ బాలాపూర్ చౌరస్తాలోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కుమ్మర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లయ్య సంస్మరణ సభకు మంత్రి హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం నిర్మాణానికి రాజమల్లయ్య ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికూడ జయంత్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు మల్కాజిగిరి దయానంద్, సంఘం గౌరవ అధ్యక్షుడు అధ్యక్షుడు బండారి భిక్షం, కార్యదర్శి లక్ష్మీనారాయణ, గోవర్ధన్, ఎంబీ సూర్యనారాయణ, డాక్టర్ రవిశంకర్, సిలివేరు వెంకటేశ్, కంభంపాటి సత్యనారాయణ, కృష్ణ య్య, శ్యాంరావు, నాగేశ్వర్రావు, నాయకులు కొళ్ల శ్రీనివాస్, నర్సింహ, దీప్లాల్ చౌహన్, వెంకటేశం తదితరులు ఉన్నారు.