సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 21:29:38

దుఃఖాన్ని దిగమింగుకుని..పదో తరగతి పరీక్షకు..

దుఃఖాన్ని దిగమింగుకుని..పదో తరగతి పరీక్షకు..

ఆత్మకూరు: కన్నతండ్రి చనిపోయినా.. గుండె నిబ్బరం చేసుకొని దుఃఖంతో పదో తరగతి పరీక్షకు ఓ విద్యార్థిని హాజరైంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన హన్మంత్‌రెడ్డి అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందాడు. కూతురు అఖిల తండ్రి మరణించిన బాధను దిగమింగి పదోతరగతి పరీక్షకు హాజరైంది. శుక్రవారం తెలుగు ద్వితీయ పేపర్‌  పరీక్ష రాసింది. ఆమె ఆత్మకూరులో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి మరణానికి కుంగిపోకుండా, ఆయన ఆశయ సాధన కోసం పరీక్ష రాయాలనుకున్నట్లు అఖిల పేర్కొన్నది. పరీక్ష అనంతరం స్వగ్రామంలో జరిగిన తండ్రి అంత్యక్రియలకు ఆమె హాజరైంది. logo