మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 16:20:50

బీజేపీ రాష్ర్ట కార్యాల‌యంలో త‌న్నులాట‌

బీజేపీ రాష్ర్ట కార్యాల‌యంలో త‌న్నులాట‌

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో న‌గ‌రంలోని గన్ ఫౌండ్రీ కార్యకర్తలు ఆందోళ‌న‌కు దిగారు. గన్ ఫౌండ్రీ బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్‌పై శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఘ‌ర్ష‌ణ‌లో కుర్చీలు ధ్వంసం కావ‌డం, ప‌లువురి దుస్తులు చిర‌గ‌డం వంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.  బీ ఫార్మ్ తీసుకునేందుకు వ‌చ్చిన ఓం ప్ర‌కాష్ వ‌ర్గంతో శైలేంద‌ర్ వ‌ర్గం ఘ‌ర్ష‌ణ‌కు దిగింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓం ప్ర‌కాష్‌కి ఎలా టికెట్ ఇస్తార‌ని గన్ ఫౌండ్రీ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శైలేందర్ యాదవ్ ప్ర‌శ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , లక్ష్మణ్‌లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే రాజసింగ్‌పై కిషన్ రెడ్డి , లక్ష్మణ్ కక్షకట్టార‌న్నారు.