శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 07:07:17

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

కుమురం భీం : కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజూమున కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత అడేళ్లు అలియాస్‌ భాస్కర్‌తోపాటు మరొకరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు నేత భాస్కర్‌ వచ్చాడనే సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగినట్లు సమాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.