e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home తెలంగాణ నేడు హైదరాబాద్‌కు సీజేఐ

నేడు హైదరాబాద్‌కు సీజేఐ

నేడు హైదరాబాద్‌కు సీజేఐ
  • ఆ హోదాలో తొలిసారి రానున్న జస్టిస్‌ ఎన్వీ రమణ

హైదరాబాద్‌, జూన్‌ 10 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకరించిన తర్వాత తొలిసారి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలంగాణకు వస్తున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు హైదరాబాద్‌ చేరుకొని నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి, అక్కడే బసచేస్తారు. విమానాశ్రయంలో జస్టిస్‌ ఎన్వీ రమణకు మంత్రి కే తారకరామారావు, ఇతర మంత్రులు స్వాగతం పలుకనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ మూడు రోజులపాటు హైదరాబాద్‌లోనే ఉంటారని సమాచారం. హైదరాబాద్‌తో జస్టిస్‌ ఎన్వీ రమణకు విడదీయరాని అనుబంధం ఉన్నది. ఇకడి హైకోర్టులోనే న్యాయవాదిగా, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా, న్యాయమూర్తిగా, తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ తర్వాత పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో హైదరాబాద్‌కు రానున్నారు.

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచుతూ బుధవారం సంబంధిత ఫైల్‌పై సంతకం చేసిన తరుణంలో ఆయన రాకకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నిర్ణయంపై సీఎం కేసీఆర్‌, పలువురు మంత్రులు, న్యాయవర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టులో జరిగిన ఓ కార్యక్రమానికి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరైనప్పుడు హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తనకు అవకాశం ఇచ్చిన ైహెకోర్టు అమ్మలాంటిదని కీర్తించారు. ఇందుకు తగ్గట్టుగానే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 75 శాతం పెంచి తన ప్రేమను చాటుకున్నారని టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ కొనియాడింది.

శ్రీవారిసేవలో సీజేఐ ఎన్వీ రమణ

ఏపీలోని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు గురువారం రాత్రి దర్శించుకున్నారు. అలిపిరి మీదుగా తిరుమల చేరుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్‌ ఎస్వీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. అంతకుముందు జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేడు హైదరాబాద్‌కు సీజేఐ

ట్రెండింగ్‌

Advertisement