గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:16

యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ భేష్‌

యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ భేష్‌

  • ఆక్సీజన్‌ పార్కులకు సీజే అభినందనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ ఆక్సీజన్‌ పార్కుల ఏర్పాటును హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ అభినందించారు. కండ్లకోయ ఆక్సీజన్‌ పార్కును చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, రేఖా దంపతులు ఆదివారం సందర్శించారు. గంటన్నరపాటు పార్కులో ప్రకృతి అందాలను వీక్షించారు. అక్కడ ఏర్పాటుచేసిన యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ బాగుందని కితాబిచ్చారు. అంతకుముందు శామీర్‌పేట నల్సార్‌వర్సిటీ సమీపంలోని జ్యుడీషియల్‌ అకాడమీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ శ్రీదేవి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అకాడమీ డైరెక్టర్‌ రమాకాంత్‌, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్‌ శోభ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. logo