మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 02:37:28

‘టీఐడీసీ’ ఎన్నికలో రఘునందన్‌కు చుక్కెదురు

‘టీఐడీసీ’ ఎన్నికలో రఘునందన్‌కు చుక్కెదురు

  • బీఎంఎస్‌పై సీఐటీయూ నేత చుక్కా రాములు విజయకేతనం

జిన్నారం, జనవరి 9: సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి పారిశ్రామికవాడలోని టీఐడీసీ పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్‌పై సీఐటీయూ గెలుపొందింది. సీఐటీ యూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 184 ఓట్లు పోలవగా, సీఐటీయూకు 94 ఓట్లు, బీఎంఎస్‌కు 90 ఓట్లు వచ్చా యి. సీఐటీయూ గెలుపుతో పరిశ్రమ ఎదుట కార్మికులు సంబురాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగేలా చూస్తామన్నారు. 


logo