Telangana
- Dec 18, 2020 , 15:00:51
VIDEOS
పండుగను సంబురంగా జరుపుకోవాలనే క్రిస్మస్ కానుకలు

ఆదిలాబాద్ : అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలనుసంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం సాయం అందిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన క్రిస్మస్ గిఫ్ట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు రంజాన్ తో పాటు క్రిస్మస్ గిఫ్ట్ లను సర్కారు ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.
వివిధ వర్గాలకు చెందిన పేద కుటుంబాలు ఆర్థిక సమస్యలతో పండుగలను సరిగా జరుపుకోలేని పరిస్థితి ఉంటుందని, సర్కారు అందించే సాయం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ టీఆర్ఎస్ నాయకులు అక్బానీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING