బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:00:04

11 నుంచి క్రిస్మస్‌ కానుకలు: మంత్రి కొప్పుల

 11 నుంచి క్రిస్మస్‌ కానుకలు: మంత్రి కొప్పుల

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: వచ్చే నెల 11వ తేదీ నుంచి జిల్లాల్లో, 12 నుం చి హైదరాబాద్‌లో క్రైస్తవులకు క్రిస్మస్‌ గిఫ్ట్‌ప్యాక్‌లు అందించనున్నట్టు ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. గిఫ్ట్‌ ప్యాక్‌ల పంపిణీ ఏర్పాట్లపై శుక్రవారం తన క్యాం పు కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి రూ. 1,518 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఆరేండ్ల నుంచి నిర్వహిస్తున్నట్టుగానే ఈ ఏడు కూడా నిరుపేద క్రిస్టియన్లకు గిఫ్ట్‌ప్యాక్‌లు అందజేస్తామని చెప్పారు. కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా ప్రతి ఏటా సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసే క్రిస్మస్‌ విం దును ఈ ఏడు నిర్వహించడం లేదని చెప్పా రు. హైదరాబాద్‌లో క్రిస్టియన్లకోసం అధునాతన భవన నిర్మించనున్నట్టు తెలిపారు. సమీక్ష అనంతరం క్రిస్లియన్లకు పంపిణీ చేయనున్న చీరెలు, దుస్తులను పరిశీలించారు.  సమావేశంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ కాంతి వెస్లీ, టెస్కో జేడీ యాదగిరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.